Telangana

బడిలో విద్యార్థులు ఉండగానే కూలిన పైకప్పు…

బడిలో విద్యార్థులు ఉండగానే కూలిన స్కూల్ పైకప్పు

తెలంగాణలో నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం నార్లాపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రమాదం చోటుచేసుకుంది. విద్యార్థులు తరగతిలో ఉండగానే నాలుగో తరగతి గది పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. అయితే ఉపాధ్యాయుడు సత్యనారాయణతో పాటు 15 మంది విద్యార్థులు తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. సుమారు 70 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ పాఠశాల భవనం ప్రస్తుతం శిథిలావస్థకు చేరిందని ప్రధానోపాధ్యాయుడు తెలిపారు. గోడల మధ్య రావి చెట్లు పెరగడం, వర్షాకాలంలో గదుల్లోకి నీరు చేరడం, పెచ్చులు ఊడిపడటం వంటి సమస్యలు ఉన్నాయని చెప్పారు. అధికారులు స్పందించి పాఠశాలను సురక్షిత ప్రాంతానికి మార్చాలని కోరారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button