ప్రజల సమస్యలు తీర్చమని అడిగితే నిర్బంధమా…

సమస్యలు పట్టవు గాని సమస్యలు తీర్చమని అడిగితే నిర్బంధమా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి.
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని ప్రజాస్వామ్య బద్దంగా బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తలపెట్టిన నిరాహార దీక్షను భగ్నం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలకు దిగుతోంది. ఉదయం నుంచి బిఆర్ఎస్ పార్టీ శ్రేణులను ఎక్కడికక్కడ గృహనిర్బంధాలతో పాటు అరెస్టు చేసి పలు పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని వేల్పూర్ లోని తన నివాసంలో పోలీసులు నిర్బంధించారు. భీంగల్ మున్సిపాలిటీ అభివృద్ధితో పాటు 100 పడకల ఆసుపత్రి నిర్మాణం, ఆర్టీసీ డిపో పునరుద్ధరణపై కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా నిరాహార దీక్ష చేయాలని ప్రశాంత్ రెడ్డి నిర్ణయించారు. శాంతియుతంగా నిరసన చేయాలని తలపెట్టగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉదయం నుంచి నిర్బంధాలతో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులను ఇబ్బందులకు గురిచేస్తుందని అన్నారు.



