చదువు ముఖ్యం… శిక్ష కాకూడదు, వై వీ యూ వి సి రాజశేఖర్
ఘనంగా ఐడి పి ఎస్ వార్షికోత్సవం

విద్యార్థులకు చదువు ముఖ్యమని.. అది శిక్ష కాకూడదని వైవీయూ విసి డాక్టర్ రాజశేఖర్ అన్నారు. సోమవారం ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ 40 వ వార్షికోత్సవ వేడుకలు స్కూల్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు క్రమశిక్షణతో మెలిగితే వారి పిల్లలు క్రమశిక్షణతో ఉంటారని పేర్కొన్నారు. మనము క్రమశిక్షణ నేర్పకుండా ఉపాధ్యాయులను నిందించడం సరికాదని తెలిపారు. డబల్ మీనింగ్ సినిమాల వల్ల విద్యార్థులు అలానే తయారవుతున్నారని చెప్పారు. విద్యార్థులకు ఏ రంగం ముఖ్యమైతే ఆ రంగంలో ప్రోత్సహించాలని, ఇతరులతో పోలుస్తూ డాక్టర్, ఇంజినీర్, సాఫ్ట్వేర్ కావాలనుకోవడం సబబు కాదని పేర్కొన్నారు. విద్యలో మార్కులు ఒక భాగమని, జీవితమే మార్కులు కాకూడదని తెలిపారు. సృజనాత్మకత ముఖ్యమని చెప్పారు. అర్థం చేసుకుంటూ చదవాలని సూచించారు. విద్యలో అన్ని సబ్జెక్టులు ముఖ్యమని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థిలో ఒక నైపుణ్యం ఉంటుందని తెలిపారు. తల్లిదండ్రులు సెల్ ఫోన్ లోకి పరిమితం కాకుండా పిల్లలతో, కుటుంబ సభ్యులతో గడపాలని చెప్పారు. భారతీయ విజ్ఞాన్ పీర్ హైదరాబాదు చైర్మన్ మనోహర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఉపాధ్యాయులతో స్నేహభావంగా మెలగాలని పేర్కొన్నారు. డిజిటల్ క్లాస్ రూమ్ లో, త్రీడీ మీన్స్ ఉన్నాయని తెలిపారు. స్కూల్ డైరెక్టర్ ఎం. వివేకానంద రెడ్డి మాట్లాడుతూ క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. పిల్లలు తప్పు చేసిన తల్లిదండ్రులు వెనుకేసుకుని రావడం సరికాదని పేర్కొన్నారు. పి టి ఏ సత్య సౌమ్య మాట్లాడుతూ తల్లిదండ్రుల సలహాలను ఉపాధ్యాయుల ఎప్పటికప్పుడు స్వీకరిస్తూ ఉన్నారని తెలిపారు. తల్లిదండ్రుల తరపున ఎలాంటి పొరపాట్లు లేకుండా చూస్తామని చెప్పారు. కార్పొరేషన్ కమిషనర్ మనోజ్ రెడ్డి మాట్లాడుతూ ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కు మంచి పేరు ఉందని పేర్కొన్నారు. క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం ఎంతో ముఖ్యమని తెలిపారు. ప్రిన్సిపల్ హరికృష్ణ స్కూలు సాధించిన విజయాలను తెలియజేశారు.
విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆలరించాయి. కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.



