Telangana

ప్రజల నీటి సమస్య తీరుస్తారా…

ప్రజల నీటి సమస్య తీరుస్తారా…

 

వాటర్ ట్యాంక్ పై కప్పు కుప్పకూలి సంవత్సరం గడుస్తున్నా గ్రామ అధికారులు మరియు మండల అధికారులకు కనువిప్పు కలగటం లేదా ?

 

నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలంలోని గోనుగోప్పుల గ్రామంలో మిషన్ భగీరథ నీరు రావటం లేదని ఎన్నిసార్లు విన్నవించినా బేఖాతరు చేస్తు పట్టించుకోని గ్రామంలోని అధికారి మరియు మండలంలోని అధికారులు పట్టించుకోవడం లేదు గతంలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ మంచి నీటి సమస్యలు ఉండకూడదని మీటింగ్లు పెట్టిన అధికారులకు దిశా నిర్దేశం చేసిన గాని కలెక్టర్ చెప్తే మాకేంటి లే అనుకొని వదిలేసిన ఈ అధికారులపై చర్యలు ఉంటాయా లేదా ? చూసి చూడనట్టు వదిలేస్తారా ? వచ్చి మీటింగ్లు పెట్టి హడావిడి చేయడం కాదు సమస్యలు పరిష్కరించేలా కృషి చేయాలి నిర్లక్ష్యానికి తావిచ్చిన అధికారులపై కొరడా జూలిపించాలని నీరు లేక గ్రామ ప్రజలు అల్లాడుతుంటే అవి పట్టవు కానీ అధికారులు ఎవరికి ఊడిగం చేస్తున్నారు ? గ్రామంలోని నీటి సమస్యను తీరుస్తారా నూతన వాటర్ ట్యాంక్ ను పునరుద్ధరిస్తారా లేదా అని మండిపడుతున్నారు. మంచి నీరు కొరతతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న గ్రామ ప్రజలను పట్టించుకోని గ్రామంలోని అధికారి వాటర్ ట్యాంక్ పైకప్పు కూలి సంవత్సరం గడుస్తున్నా కానీ వాటర్ ట్యాంక్ కనిపించడం లేదా ? అధికారులు ఇకనైనా మొద్దు నిద్ర విడి గ్రామ ప్రజలకు సేవ చేయండి రాజకీయ నాయకులకు కాదు ఇంకా ఎన్ని సంవత్సరాలు అయితే ఈ మంచినీటి వాటర్ ట్యాంక్ ని పునరుద్ధరిస్తారు.

ప్రజల పన్నుల్లో నుండి జీతం తీసుకోవడం లేదా ఇకనైనా కళ్ళు తెరిచి వాటర్ ట్యాంక్ పునరుద్ధరించి గ్రామ ప్రజల దాహార్తి తీర్చాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button