Telangana
త్వరలో ఓపెన్ టాప్ డబుల్ డెక్కర్ బస్సులు…

త్వరలో ఓపెన్ టాప్ డబుల్ డెక్కర్ బస్సులు
తెలంగాణ రాష్ట్రంలోని పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ (టీజీటీడీసీ) ఓపెన్ టాప్ డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురానుంది. తొలిదశలో రెండు బస్సులను నడపనున్నారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఐటీ కారిడార్‌తో పాటు నగరంలోని చారిత్రక ప్రాంతాలను ఈ బస్సులు కవర్ చేయనున్నాయి. పైభాగం ఓపెన్ టాప్‌గా, కింది భాగం ఏసీ విభాగంగా ఉండే ఈ బస్సుల్లో జీ,పీ,ఎస్, సీ,సీ,టీవీ, గైడ్ సదుపాయాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.




