Telangana
రిమ్స్ హాస్పిటల్లో అగ్నిప్రమాదం…

ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్‌లో భారీ అగ్ని ప్రమాదం ఇద్దరు చిన్నారులు మృతి
ఆదిలాబాద్ జిల్లాలోని రిమ్స్ ఆసుపత్రిలో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అగ్నిప్రమాదం జరిగింది. ఆస్పత్రిలోని చిన్న పిల్లల వార్డులో (ఎన్,ఐ,సి,యు) ఏసీ పేలడంతో ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా ఒక్కసారిగా మంటలు చెలరేగి దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఆ సమయంలో వార్డులో మెుత్తం 27 మంది పిల్లలకు చికిత్స అందిస్తుండగా తల్లిదండ్రులు, ఆసుపత్రి సిబ్బంది స్పందించి వారిని బయటకు తీసుకురాగా మిగిలిన చిన్నారులకు ఇతర ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారని తెలిపారు.




