Political
రైతులకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి…

రైతులకు ఫార్మర్ రిజిస్ట్రీషన్ తప్పనిసరి తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం రైతులకు కీలక సూచన చేసింది. రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ విధానంలో రైతులకు ఒక యూనిక్ ఐడీ కేటాయిస్తారు. ఈ ఐడీ ఆధారంగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు, సబ్సిడీలు, పంట రుణాలు, కనీస మద్దతు ధర (యం,ఎస్,పి) లభిస్తాయి. ఈ రిజిస్ట్రేషన్ కోసం సెప్టెంబర్ 22 నుంచి 30 వరకు గ్రామాల్లో ప్రత్యేక క్యాంపెయిన్లు నిర్వహించనున్నారు. రైతుల ఆధార్ కార్డు, భూమి పాస్‌బుక్, ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్‌తో ఈ సేవను పొందవచ్చని తెలిపారు.



