Telangana
యాసంగిలో వరి సాగును నిలిపివేయాలి…

యాసంగిలో వరికి క్రాప్ హాలిడే శాస్త్రవేత్తలు
తెలంగాణలోని ఎల్నినో ప్రభావంతో నీటి లభ్యత తగ్గిపోవడంతో యాసంగిలో వరి సాగును నిలిపివేయాలని (క్రాప్ హాలిడే) వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. రైతులకు నష్టం కలగకుండా ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలని తాజా సదస్సులో నిర్ణయించారు. నీటి వాడకం తక్కువగా ఉండే మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, నువ్వులు, పెసర్లు, మినుములు వంటివి సాగు చేయాలని వారు చెబుతున్నారు. ఇప్పటికే వర్షాభావంతో పలుచోట్ల పంటలకు నీరు లేని పరిస్థితి నెలకొందని అంటున్నారు.




