Telangana
ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారం…

సర్కారు బడుల్లో 9:30లోపే టిఫిన్ పూర్తి చేయాలి: విద్యాశాఖ
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఉదయం 9:30 గంటల్లోపు టిఫిన్, పాలు పెట్టడం పూర్తి చేయాలని విద్యాశాఖ స్పష్టం చేసింది. సెంట్రలైజ్డ్ కిచెన్ల నుంచి ఉదయం 6:30 నుంచి 8:45 గంటల మధ్య టిఫిన్ పంపిణీ చేయాలని ఆదేశించింది. అల్పాహారం (బ్రేక్‌ఫాస్ట్) విత్ మిల్క్ పథకాన్ని అక్టోబర్ నెలాఖరులోగా అన్ని పాఠశాలల్లో అమలు చేయనున్నారు. మరుసటి రోజు ఎంతమంది విద్యార్థులకు టిఫిన్ కావాలో ప్రధానోపాధ్యాయులు మధ్యాహ్నం 12లోపు యాప్ లేదా వెబ్‌సైట్‌లో ఇండెంట్ పంపాలని ఆలస్యమైతే ఇండెంట్ ఆటోమేటిక్‌గా లాక్ అవుతుందని తెలిపారు.




