అనుమతి లేకున్నా విద్యా బోధన…

అనుమతి లేకున్నా విద్య బోధన…
అనుమతులు లేని పాఠశాలలపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారా ? ఉన్నతాధికారులు చెప్పండి మరి ?
జిల్లా ఉన్నతాధికారులకు మరియు మండలంలోని విద్యాశాఖ అధికారులకు మిలాకత్ అయితే సరిపోతుంది.
విద్యాశాఖలో ప్రవేట్ పాఠశాలలకు ఇచ్చే అనుమతి లేకుంన్న విద్య బోధన నడుస్తుందనేది పిల్లల తల్లిదండ్రులు గమనిస్తున్నారా ? అనుమతులు ఉన్నాయా లేవా అనేది చూసి మరి ప్రైవేట్ స్కూళ్లని ఎంచుకోండి ?
నిజామాబాద్ జిల్లాలోని విద్యాశాఖ అధికారులు ఇకనైనా మొద్దు నిద్ర విడి ప్రైవేటు పాఠశాలలకు
కొమ్ముకాస్తున్నారని స్థానిక ప్రజలు అంటున్నారు. ప్రవేట్ పాఠశాలకు ఏడవ తరగతి వరకు గుర్తింపు ఉంది కానీ పదవ తరగతి వరకు గుర్తింపు ఉన్నట్లు సృష్టించి క్లాస్లు తీసుకోవడం ఏంటి ఎనిమిదవ తరగతి 9వ తరగతి పరీక్షలు రాయించి ఇంతవరకు సర్టిఫికెట్లు కూడా జారీ చేయని ప్రవేట్ పాఠశాలలు ఉన్నాయి తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యాన్ని సర్టిఫికెట్లు ఎప్పుడు జారీ చేస్తారు అని అడిగినా గాని ఇస్తాము పదవ తరగతి చదివితేనే ఇస్తామని అంటున్నటువంటి ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులు ఈ రెండు సంవత్సరాల చదువు మా పిల్లల భవిష్యత్తు ఏంటి అని అధికారులు ఇకనైనా మొద్దు నిద్ర వీడి అనుమతులు లేని ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని పిల్లల తల్లిదండ్రులు స్థానిక ప్రజలు అంటున్నారు.




