Crime

అక్రమ ఇసుక రవాణా దందా…

అక్రమ ఇసుక రవాణా దందా…

భీంగల్ పోలీస్ స్టేషన్లో ఇసుక ట్రాక్టర్లుతో రెండు రోజులుగా ఇసుక ట్రాక్టర్లు నిల్వ ఉన్నాయి తప్ప వాటిపై చర్యలు తీసుకుంటారా లేదా ?

భీంగల్ పోలీస్ స్టేషన్లో రెండు రోజుల క్రితం ఇసుకతో సహా రెండు ట్రాక్టర్లను పట్టుకున్న పోలీసు సిబ్బంది ఇసుక లోడ్ తో సహా పోలీస్ స్టేషన్ లో రెండు రోజులుగా ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఉంటున్న వైనం గతంలో ఇసుక ట్రాక్టర్లను సంబంధిత అధికారులకు గంటల వ్యవధిలో బైండోవర్ చేసిన అధికారులు వీటిపై నిర్లక్ష్యానికి ఎందుకు మొగ్గు చూపుతున్నారు. రెండు రోజులుగా ఈ ట్రాక్టర్లు పట్టుకున్నామని అధికారికంగా పత్రికా విలేకరులకు సమాచారం ఇవ్వని సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారుల నిర్లక్ష్యమా లేదా వెనకాల ఏదైనా చేతివాటం ప్రదర్శిస్తున్నారా ? అనేది స్థానిక ప్రజలు గతంలో సీజ్ అయిన ట్రాక్టర్ యజమానులు డ్రైవర్లు వీటి వెనకాల మతలపైందని స్టేషన్ లోని ఇంత జరుగుతున్న సంబంధిత అధికారులు వీటిపై దృష్టి పెట్టకపోవడం ఏంటని నిలదీసే పరిస్థితి ఉంది. ఇకనైనా పై అధికారులు మొద్దు నిద్ర విడి స్థానికంగా ఏ పోలిస్టేషన్లోనైనా ఏం జరుగుతుందో అనేది ప్రతిరోజు జిల్లా అధికారులకు సమాచారం లేదా ? పోలీస్ డిపార్ట్మెంట్ మామూళ్ల మత్తులో ఉండి నచ్చిన వాడిని వదిలేస్తాం నచ్చని వాడికి చేతివాటం చూపిస్తాం అనడం ఎంతవరకు సమంజసం సంబంధిత పోలీసులే కదా ఈ ట్రాక్టర్లను పట్టుకున్నది వేరే వ్యక్తులు అయితే కాదు కదా ఈ ట్రాక్టర్ల పై చర్యలు ఉంటాయా తూతూ మంత్రంగా ఎటువంటి చర్యలు తీసుకోకుండా చేతివాటం ప్రదర్శిస్తారా అని స్థానిక ప్రజలు అంటున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button