Crime
భార్య ముక్కు కొరికిన భర్త…

కాపురానికి రావడం లేదంటూ భార్య ముక్కు కొరికిన భర్త
మంచిర్యాల జిల్లా కోటపల్లికి చెందిన బాధితురాలి ముక్కు తెగిపడగా ఆమెను వరంగల్ ఎం,జీ,ఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. మమత, మల్లంపేట గ్రామానికి చెందిన ఎనగందుల మణించందర్ తో ఎనిమిదేళ్ల క్రితం వివాహం కాగా వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. భార్య భర్తల మధ్య మన స్పర్ధలు రావడంతో ప్రస్తుతం మమత పుట్టింట్లో ఉంటుంది. కాపురానికి రావాలని ఎంత చెప్పిన వినక పోవడంతో మణించందర్ సోమవారం అత్త గారింటికి వచ్చి మామ నారాయణతో గొడవకు దిగాడు కర్రతో అయన తలపై కొట్టడంతో తీవ్ర రక్తస్రావంతో అడ్డువచ్చిన భార్యపై దాడి చేసి ఆమె ముక్కును బలంగా కొరికేయడంతో కొంత భాగం తెగిపడింది. వైద్యం కోసం ఎనగందుల తరలించారని తెలిపారు.



