Telangana

కాళీ పోస్టుల భర్తీపై కీలక ప్రకటన…

ఖాళీ పోస్టుల భర్తీపై కీలక ప్రకటన…

 

తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న డాక్టర్లు, నర్సింగ్ ఆఫీసర్లు సహా అన్ని పోస్టులను యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నట్లు వైద్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహం తెలిపారు. రాష్ట్రంలో వైద్య సేవలను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తోందన్నారు.
గత రెండు సంవత్సరాల్లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10,000 పోస్టులు ఇప్పటికే భర్తీ చేసినట్లు మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం మరో 7,000 పోస్టుల నియామక ప్రక్రియ చివరి దశలో కొనసాగుతోందని పేర్కొన్నారు.
అలాగే రెగ్యులర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ 607 పోస్టులను ఏప్రిల్ నెలలో భర్తీ చేయనున్నట్లు చెప్పారు. ఇక 1,616 స్పెషలిస్ట్ డాక్టర్ల నియామకం వచ్చే నెలలో పూర్తవుతుందని మంత్రి స్పష్టం చేశారు. ఈ నియామకాలతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు మరింత మెరుగుపడతాయని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button