Telangana
వడ్ల కొనుగోళ్లు అక్టోబర్ మొదటివారం నుంచి…

అక్టోబర్ మొదటివారం నుంచే వడ్ల కొనుగోళ్లు ప్రారంభం
తెలంగాణ రాష్ట్రంలో వానాకాలం ధాన్యం కొనుగోళ్లు అక్టోబర్ మొదటి వారం నుంచే ప్రారంభించేందుకు సివిల్ సప్లయ్స్ శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 8,283 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 65 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సివిల్ సప్లయ్స్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర పౌరసరఫరాల అధికారులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం గుర్తించిన 7 రకాల సన్న ధాన్యానికి క్వింటాల్‌కు రూ,500 బోనస్ అందించనున్నారు. బోనస్ పొందాలంటే రైతులకు అగ్రిస్టాక్ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడీ తప్పనిసరి అని తెలిపారు.




